జేఎంఎం నుంచి సీతా సోరెన్‌ బహిష్కరణ

ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వదిన సీతా సోరెన్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది.

Updated : 18 May 2024 06:17 IST

రాంచీ: ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వదిన సీతా సోరెన్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. జేఎంఎం ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భాజపాలో చేరి, లోక్‌సభ బరిలో దిగిన విషయం తెలిసిందే. పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసి, దుమ్కా నుంచి పోటీ చేస్తున్నందుకు ఈ వేటు వేసినట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. భాజపాలో చేరినందువల్ల ఇప్పటికే తాను జేఎంఎంకు రాజీనామా చేశానని, ఆ పార్టీతో సంబంధమే లేదని సీతా సోరెన్‌ స్పందించారు. సిటింగ్‌ ఎంపీ విజయ్‌ హంస్‌దక్‌పై స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఎమ్మెల్యే లొబిన్‌ హెమ్‌బ్రోమ్‌పైనా జేఎంఎం బహిష్కరణ వేటు వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు