కన్హయ్య కుమార్‌పై దాడికి యత్నం

కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్‌పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు.

Published : 18 May 2024 04:45 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్‌పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. స్థానిక కౌన్సిలర్‌ను శుక్రవారం కలిసి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ‘కొందరు వ్యక్తులు వచ్చి కన్హయ్యకు దండ వేశారు. ఆ వెంటనే సిరాను ఆయనపై చల్లి దాడికి యత్నించారు. అడ్డుకోబోయిన నాతోనూ అసభ్యంగా ప్రవర్తించి, బెదిరింపులకు గురిచేశారు’ అని పోలీసులకు కౌన్సిలర్‌ ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత కన్హయ్య స్పందిస్తూ.. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే సిటింగ్‌ ఎంపీ, భాజపా అభ్యర్థి మనీశ్‌ తివారీ దాడులకు పాల్పడున్నారని ఆరోపించారు. ఆరో విడతలో భాగంగా మే 25న ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో ప్రజలే అతడికి బుద్ధి చెబుతారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని