ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.40 వేల కోట్లు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు.

Published : 18 May 2024 05:07 IST

 మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు

ఈనాడు డిజిటల్, అమరావతి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్‌ వాటానే రూ.40 వేల కోట్లని పేర్కొన్నారు. అనుమతుల్లేని రీచ్‌ల్లో తవ్వకాలు ఆపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ.. నేటికీ తవ్వకాలు సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని.. 2023 మార్చిలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలిచ్చినా, పట్టించుకోలేదు. దీనిపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తే.. వారు తవ్వకాలు లేవంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు. పైగా ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్న వారిపై కేసులు పెట్టామని చెబుతున్నారు. ఇప్పటివరకు ఎంతమందిపై కేసులు పెట్టారో వెంకటరెడ్డి చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. వైకాపా వాళ్లకు కొమ్ముకాస్తూ, అక్రమాలకు సహకరించిన అధికారులందరికీ భవిష్యత్తులో తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని