జూన్‌ తొలివారంలోనే ‘రైతు భరోసా’ ఇవ్వాలి

జూన్‌ తొలి వారంలోనే ‘రైతు భరోసా’ డబ్బులివ్వాలని... పంటసాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా చూడాలని భారాస మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Published : 19 May 2024 02:19 IST

తడిసిన ధాన్యం అంతా కొనాల్సిందే
భారాస మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌ : జూన్‌ తొలి వారంలోనే ‘రైతు భరోసా’ డబ్బులివ్వాలని... పంటసాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా చూడాలని భారాస మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అకాలవర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని... ఆ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన కోరారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో సాధించిందేమీ లేదన్నారు. ‘దేశంలోనే తొలిసారి రైతుబంధు పథకాన్ని అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది. దున్నేటప్పుడే రైతుకు పెట్టుబడి సాయం వస్తే ఉపశమనంగా ఉంటుంది. జూన్‌ మొదటి వారంలోనే రైతులకు ఎకరాకు రూ.7500 విడుదల చేయాలి’ అని కోరారు. ‘క్వింటాకు రూ.500 బోనస్‌ సన్నవడ్లకే ఇవ్వాలని ప్రభుత్వం అనుకోవడం రైతులను మోసగించడమే. ఎన్నికలకు ముందు సన్న వడ్లకే బోనస్‌ అని రేవంత్‌ చెప్పి ఉంటే.. కాంగ్రెస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చేవి కాదు’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని