మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Published : 19 May 2024 02:58 IST

జనసేన సమన్వయకర్త, మరొకరిపైనా నమోదు

అంగర, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. జోగేశ్వరరావు, లీలాకృష్ణ, వీరబాబు తమను కులం పేరుతో దూషించినట్లు వల్లూరుకు చెందిన నక్కా భాస్కరరావు, నక్కా అమ్మిరాజు, పలివెల రోషన్‌ వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటికే వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది. తాజాగా ఇప్పుడు కూటమి నాయకులపైనా కేసులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని