ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి

ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Published : 19 May 2024 06:53 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాజమహేంద్రవరం (వి.ఎల్‌.పురం), న్యూస్‌టుడే: ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కొత్త ఇసుక పాలసీ అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్‌ భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడేలా చేశారని విమర్శించారు. వైకాపా పాలనలో ఆ పార్టీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. గోదావరిలో ఇసుకను ఎంత అక్రమంగా తవ్వుతున్నారో అందరికీ తెలుసునన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మధు, సహాయ కార్యదర్శి రాంబాబు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని