చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు

వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్‌ వేదికగా ఆమె పేర్కొన్నారు.

Published : 19 May 2024 03:34 IST

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల

ఈనాడు, అమరావతి: వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్‌ వేదికగా ఆమె పేర్కొన్నారు. ‘చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే. వివేకా కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉద్ధృతం చేస్తాం’ అని షర్మిల పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని