స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పహారా ఉండాలి

ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 19 May 2024 03:34 IST

ఎన్డీయే శ్రేణులకు నాగబాబు సూచన

ఈనాడు డిజిటల్, అమరావతి: ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఓటమి భయంతో వైకాపా నాయకులు ఉన్మాదంతో ప్రజల ఇళ్లపై పడి అరాచకం సృష్టిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్‌ బాంబులు దొరికాయి. అంటే ఫలితాల తర్వాత ఎంతటి రాక్షసత్వానికి తెగబడతారో గ్రహించాలి. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకులు దాడులు, హింసకు తెగబడే ప్రమాదం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా కచ్చితమైన సమాచారం ఉంది. అందుకే రాష్ట్రంలో వచ్చే నెల 15 వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. కౌంటింగ్‌ కేంద్రాలు, పార్టీ కార్యాలయాల వద్ద కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం అరాచక శక్తుల నుంచి అభివృద్ధి సాధకుల చేతుల్లోకి మారే సమయం దగ్గర్లోనే ఉంది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని