స్టాంపు, సంతకాల్లేని పోస్టల్‌ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా

అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్‌బాబు, ఏఎస్‌ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు.

Published : 19 May 2024 03:35 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్‌బాబు, ఏఎస్‌ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నికల అధికారులకు లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ‘పోస్టల్‌ బ్యాలట్‌ ఎన్నికల్లో డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన కొంతమంది అధికారులు వారి అధికార స్టాంపు, సీల్‌ వేయలేదు. మరికొన్ని చోట్ల పోస్టల్‌ బ్యాలట్‌ పేపర్‌ వెనుక ప్రిసైడింగ్‌ అధికారులు సంతకం చేయలేదు’ అని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని