దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Published : 19 May 2024 05:30 IST

గోఘాట్‌: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. భాజపా 200 సీట్ల మార్కును దాటబోదని చెప్పారు. ఆరాంబాగ్‌ లోక్‌సభ పరిధిలోని గోఘాట్‌లో ఆమె శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘కూటమికి ఇండియా అని పేరు పెట్టిందే నేను. నియంతృత్వ, అప్రజాస్వామిక మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి జాతీయ స్థాయిలో మేమంతా కలిసి పోరాడుతున్నాం’’ అని మమత పేర్కొన్నారు. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ, సీపీఎం భాజపాతో అంటకాగుతున్నాయని ఆమె దుయ్యబట్టారు. ఈ అనైతిక పొత్తుపై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని.. టీఎంసీయేతర పార్టీలకు ఓట్లు వేస్తే అవి భాజపాకే వెళతాయని మమత హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని