ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు

ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు.

Published : 19 May 2024 05:32 IST

 100 మంది నేరచరితులు: ఏడీఆర్‌

భువనేశ్వర్‌: ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో చంపువా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సనాతన్‌ మహాకుడ్‌ రూ.227.67 కోట్ల ఆస్తులతో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. భువనేశ్వర్, కటక్, ఢెంకనాల్, పూరీ, సంబల్‌పుర్, కియోంజర్‌ లోక్‌సభ స్థానాల పరిధిలోని 42 శాసనసభ స్థానాలకు ఈ నెల 25న పోలింగ్‌ జరగనుంది. ఈ 42 స్థానాల నుంచి మొత్తం 383 మంది అభ్యర్థులు పోటీచేస్తుండగా వారిలో 381 మంది ప్రమాణ పత్రాలను ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌లు విశ్లేషించాయి. ఈ 381లో మంది 126 మంది (33 శాతం) కోటీశ్వరులని ఏడీఆర్‌ తెలిపింది. అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ.3.47 కోట్లుగా ఉందని వెల్లడించింది. 100 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించగా, వారిలో 86 మంది తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ల విశ్లేషణలో వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు