ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ

ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 19 May 2024 05:37 IST

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని, ఇది ప్రజల విశ్వాసాలను రెచ్చగొట్టడమేనని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ప్రధాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కోర్టు తీర్పును గౌరవించి రామ్‌ లల్లా ఆలయ గేట్లను అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ తెరిపించినపుడు మోదీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తప్పుబట్టిన మోదీ.. మహిళలకు వ్యతిరేకమని అర్థమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల రోజు ఓటర్లకు సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని