రాహుల్, అఖిలేశ్‌ సభలో తొక్కిసలాట

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొన్న సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

Published : 20 May 2024 03:55 IST

ప్రసంగించకుండానే వెనుదిరిగిన నేతలు

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొన్న సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో నేతలిద్దరూ ప్రసంగించకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సమీప ఫూల్‌పుర్‌ నియోజకవర్గ పరిధి పాడిలా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సభకు రాహుల్, అఖిలేశ్‌ హాజరయ్యారు. వీరిని చూడడానికి కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తలు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకురావడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వారిని నియంత్రించకలేకపోయారు. అఖిలేశ్, రాహుల్‌ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా వారిద్దరూ ప్రసంగించకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు