మమత గురించి ఖర్గే చెప్పినా వినను: అధీర్‌

మమతా బెనర్జీ విషయంలో సంయమనం పాటించాలని కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం చెబుతున్నా అంగీకరించేది లేదని బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌధరి తేల్చిచెప్పారు.

Updated : 20 May 2024 06:33 IST

కోల్‌కతా: మమతా బెనర్జీ విషయంలో సంయమనం పాటించాలని కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం చెబుతున్నా అంగీకరించేది లేదని బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌధరి తేల్చిచెప్పారు. తనను, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అంతం చేయాలని చూస్తున్న మమత గురించి సానుకూలంగా మాట్లాడలేనని పేర్కొన్నారు. ‘మమతా బెనర్జీపై వ్యక్తిగత కక్ష లేదు. అయినప్పటికీ ఆమె రాజకీయ నైతికతను ప్రశ్నిస్తా. ఒక వేళ ఖర్గే నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా స్పందించినా.. నేను మాత్రం క్షేత్ర స్థాయిలోని కాంగ్రెస్‌ కార్యకర్తల కోసం మాట్లాడుతూనే ఉంటాన’ని అధీర్‌ తెలిపారు. మమతపై అధీర్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వరాదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే స్పందించిన గంటల వ్యవధిలోనే ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు టీఎంసీ ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ స్పందిస్తూ.. తమ పార్టీ ఇండియా కూటమిలోనే ఉందన్నారు. తరచూ మమతను విమర్శిస్తున్న అధీర్‌.. భాజపాకు ప్రాణ వాయువు అందిస్తున్నారని విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు