సూత్రధారులపై చర్యలు తీసుకోండి

తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సిట్‌ అధికారులను కోరారు.

Published : 20 May 2024 04:20 IST

సిట్‌ అధికారులను కోరిన పులివర్తి నాని

సిట్‌ అధికారులతో మాట్లాడుతున్న పులివర్తి నాని

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సిట్‌ అధికారులను కోరారు. ఆదివారం రాత్రి ఎస్వీయూ పోలీసుస్టేషన్‌లో అధికారులను ఆయన కలిశారు. ఎన్నికల రోజు, తర్వాత వైకాపా నాయకులు తనపైన, తెదేపా కార్యకర్తలపైన చేసిన దాడులు, హత్యాయత్నం ఘటనలకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. ఘటనకు ప్రధాన కారకులైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిల పాత్రను బహిర్గతం చేయాలని కోరారు. హింసను ప్రేరేపిస్తున్న వైకాపా నాయకులపై చర్యలు తీసుకుని శాంతియుత వాతావరణం తీసుకురావాలని కోరారు. హింసాత్మక ఘటనలతో సంబంధం లేని కొందరు తెదేపా అనుచరులను కేసులలో ఇరికించారని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని