వైకాపా సోషల్‌మీడియా విభాగంపై కేసు

వైకాపా సోషల్‌ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్‌ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్‌ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు.

Updated : 20 May 2024 04:54 IST

ఈనాడు, అమరావతి: వైకాపా సోషల్‌ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్‌ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్‌ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ రోజున ఆ పార్టీ తన సోషల్‌ మీడియా వేదికలైన వైకాపా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రచారం చేసి ఓటర్లను ప్రభావితం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన ఫిర్యాదుపై శుక్రవారం వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని, గతంలో ఈసీకి పంపిన ఫిర్యాదును రిఫరెన్స్‌గా పెట్టి ఈ నెల 17న ఎన్నికల సంఘానికి మరోసారి సోమశేఖర్‌ ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఈఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించారు. వైకాపా కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఉండడంతో దీనికి సంబంధించిన ఫిర్యాదును శనివారం తాడేపల్లి పోలీసులకు పంపగా స్థానిక స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కల్యాణరాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని