ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు

ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చింతా మోహన్‌ పేర్కొన్నారు.

Updated : 20 May 2024 07:15 IST

చింతా మోహన్‌ 

ఈనాడు, దిల్లీ: ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చింతా మోహన్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఇక్కడి ఏపీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఏపీలో సీఎం జగన్, ప్రధాని మోదీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించాయి. చంద్రబాబు భాజపాతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని అసెంబ్లీ సీట్లు తగ్గుతాయి. లేదంటే 150కి పైగా వచ్చేవి. దేశవ్యాప్తంగా భాజపాకు 150కి మించి ఎంపీ స్థానాలు రావు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ వైకాపా రూ.4-5 వేల కోట్ల వరకు ఖర్చు చేసింది. అంత డబ్బును జగన్‌ ఎలా తేగలిగారు? అందుకు ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలిచ్చినా తక్కువే. ఎన్ని అక్రమాలకు పాల్పడినా.. ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని