విపక్ష నేతలంతా రావణుడి అనుచరులే..

విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా రావణుడి అనుచరులని.. సనాతన ధర్మాన్ని, ప్రధాని మోదీని, భాజపాను, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటమే వారి పని అని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ మండిపడ్డారు.

Published : 20 May 2024 05:00 IST

మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌

బలియా(ఉత్తర్‌ప్రదేశ్‌): విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా రావణుడి అనుచరులని.. సనాతన ధర్మాన్ని, ప్రధాని మోదీని, భాజపాను, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటమే వారి పని అని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ మండిపడ్డారు. జూన్‌ 1న పోలింగ్‌ జరగనున్న బలియా లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి తరఫున ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని 20 నుంచి 25 కుటుంబాల నుంచే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కావాలని దేశంలో కొందరు కోరుకుంటున్నారన్నారు. అటువంటి వాళ్లు కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ నమ్మరని సమాజ్‌వాదీ పార్టీని ఉద్దేశించి ఆరోపించారు. కృష్ణుడిని శిశుపాలుడు అవమానించినట్లే.. మోదీ పట్ల విపక్ష నేతల తీరూ ఉందన్నారు. బ్రిటిష్‌ రాజ్‌తోపాటు పాలనలో అదేవిధంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ కాలం నాటి గుర్తులను మోదీ సర్కారు చెరిపివేస్తోందన్నారు. ప్రధానికి ఎటువంటి బంధుప్రీతి లేదని.. కేవలం సైనికులు, రైతులే ఆయనకున్న ఆస్తులని స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని