రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా, భారాస

రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 20 May 2024 05:03 IST

సామ రామ్మోహన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం (ఈ నెల 18న) నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇవ్వలేదని, ఈ అంశంపై ఈసీని ఆ రెండు పార్టీలు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇచ్చిందని, ఈ ఆంక్షలకు భారాస, భాజపా నేతలే కారణమని ఆయన ఆరోపించారు. రైతులకు మేలు జరగడం ఆ పార్టీలకు ఇష్టం లేదని ఆయన విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస, భాజపాలకు ఓటడిగే నైతికహక్కు లేదని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ విమర్శించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని