టీఎంసీ గెలిచే సీట్లన్నీ ఇండియా కూటమికే!

పశ్చిమ బెంగాల్లో టీఎంసీని అత్యధిక సీట్లతో గెలిపిస్తే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అది గరిష్ఠ స్థాయిలో ఉపయోగపడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

Published : 21 May 2024 04:11 IST

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దోహదం
ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ

పంసకుడా: పశ్చిమ బెంగాల్లో టీఎంసీని అత్యధిక సీట్లతో గెలిపిస్తే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అది గరిష్ఠ స్థాయిలో ఉపయోగపడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ‘ఇవి దిల్లీ ఎన్నికలు. మీ ఓట్లతో రాష్ట్రంలో ప్రతి సీటునూ టీఎంసీ గెలుచుకునేలా చేస్తే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఉపయోగపడుతుంది’ అని మమతా బెనర్జీ సోమవారం సంకుడాలో నిర్వహించిన ఎన్నికల సభలో అన్నారు. సందేశ్‌ఖాలీలో మహిళల లైంగిక వేధింపుల ఆరోపణలన్నీ భాజపా కుట్రేనని మరోసారి ధ్వజమెత్తారు. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలన్నదే వారి తదుపరి కుట్ర అని ఆరోపించారు.

రామకృష్ణ మిషన్‌ను విమర్శించలేదు

సమాజానికి రామకృష్ణ మిషన్, భారత సేవాశ్రమ్‌ సంఘం ఎన్నో సేవలు చేస్తున్నాయని మమతా బెనర్జీ ప్రశంసించారు. ఈ రెండు సంస్థలకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇటీవల తాను విమర్శించింది ఒకరిద్దరు సాధువులను మాత్రమేనని, వారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని బంకురాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మమత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని