అయిదో దశ పోలింగ్‌తో విపక్షాల విచ్ఛిన్నానికి నాంది: మోదీ

లోక్‌సభ ఎన్నికల అయిదోదశ పోలింగు ముగియడంతో తృణమూల్‌ సహా ఇండియా కూటమి ఓటమికి మరింత చేరువైందని.. విపక్షాల విచ్ఛిన్నానికి ఇది నాందిగా ప్రధాని మోదీ తెలిపారు.

Published : 21 May 2024 04:11 IST

ఝాడ్‌గ్రామ్‌: లోక్‌సభ ఎన్నికల అయిదోదశ పోలింగు ముగియడంతో తృణమూల్‌ సహా ఇండియా కూటమి ఓటమికి మరింత చేరువైందని.. విపక్షాల విచ్ఛిన్నానికి ఇది నాందిగా ప్రధాని మోదీ తెలిపారు. సోమవారం ఒడిశా నుంచి పశ్చిమబెంగాల్‌ చేరుకొన్న ప్రధాని ఝాడ్‌గ్రామ్‌ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ముస్లింలీగ్‌ ఆలోచనా ధోరణి ఉన్న కాంగ్రెస్‌ మతతత్వ పార్టీ అని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఓ వీడియోలో స్వయంగా కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌గాంధీని ఉద్దేశించి) ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేస్తున్నారని ప్రధాని చెప్పారు. బెంగాల్‌లోని రామకృష్ణ మిషన్, భారత్‌ సేవాశ్రమ్‌ సంఘలకు చెందిన సాధువులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన బెదిరింపులు టీఎంసీ గూండాలను దాడులకు పురికొల్పడం ఆందోళనకరమని అన్నారు. జల్‌పాయీగుడీ రామకృష్ణ మిషనుపై జరిగిన దాడిని ఖండించారు. ఝాడ్‌గ్రామ్‌ తర్వాత తమ్‌లుక్‌ సభకు హాజరుకావాల్సిన మోదీ హెలికాప్టరు ప్రయాణానికి వాతావరణం అనుకూలించని కారణంగా అక్కడి ప్రజలనుద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని