రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే

రైతుల ఆత్మహత్యలు నిస్సందేహంగా జగన్‌ ప్రభుత్వ హత్యలేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మండిపడ్డారు. ‘

Published : 21 May 2024 04:13 IST

భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

ఈనాడు, అమరావతి: రైతుల ఆత్మహత్యలు నిస్సందేహంగా జగన్‌ ప్రభుత్వ హత్యలేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మండిపడ్డారు. ‘నాలుగేళ్లు అతివృష్టి.. ఐదో ఏడు అనావృష్టి.. వెరసి సీఎం జగన్‌ పాలనలో రైతులు అప్పుల ఊబిలో ఇరుక్కున్నారు. ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రుణాల భారంతో ధర్మవరం మండలంలో బలవన్మరణానికి పాల్పడ్డ బాలకృష్ణ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా. కూటమి అధికారంలోనికి రాగానే వారి కుటుంబాన్ని ఆదుకుంటాం’ అని ఎక్స్‌ వేదికగా సత్యకుమార్‌ సోమవారం హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని