ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సీపీఐ

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్‌ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని విడనాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Published : 21 May 2024 04:13 IST

ఈనాడు, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్‌ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని విడనాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ నెలాఖరుకు ఆయన పదవీవిరమణ పొందుతున్న దృష్ట్యా వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని కోరారు. ‘ఏబీ వెంకటేశ్వరరావును.. జగన్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసి, వివిధ రకాలుగా వేధించింది. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని క్యాట్‌ ఆదేశాలిచ్చినా రాష్ట్రప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. పదవీవిరమణ కాలం ముగిసేవరకు తాత్సారం చేసి, విధుల్లోకి తీసుకోకూడదనే ఆలోచనతో కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది’ అని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు