ప్రశాంత పల్నాడులో వైకాపా అశాంతి రేపింది

ప్రశాంత పల్నాడులో వైకాపా నేతలు అశాంతి రేపారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 21 May 2024 04:14 IST

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర

ఈనాడు, అమరావతి: ప్రశాంత పల్నాడులో వైకాపా నేతలు అశాంతి రేపారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. కొంతమంది పోలీసు అధికారులతో వారు కుమ్మక్కై తెదేపా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారని మండిపడ్డారు. అధికారుల్ని మార్చినచోటే అల్లర్లు జరిగాయంటూ వైకాపా దుష్ప్రచారం చేస్తోందని ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘ఎవరు ఎవరిపై దాడులు చేశారో వీడియోల్లో కనిపించడం లేదా? స్థానికులు చెప్పడం లేదా? కావాలనే తెదేపా అధినేత చంద్రబాబుపై, పార్టీపై అభాండాలు మోపుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. వైకాపా నేతలు వివిధ దేశాలకు పారిపోతున్నారన్నారు. జూన్‌ 4 తర్వాత మిగిలిన నాయకులు కూడా విదేశాలకు వలసపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని