ఐప్యాక్‌తో పాటు ఖాళీ అయిన సీఐడీ కార్యాలయం

ఎన్నికల తర్వాత వైకాపా సోషల్‌ మీడియా, ఐప్యాక్‌ల బృందంతో పాటు జగన్‌ కనుసన్నల్లో నడిచిన సీఐడీ కార్యాలయం కూడా ఖాళీ అయిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

Published : 21 May 2024 04:15 IST

 తెదేపా నేత వర్ల రామయ్య ఎద్దేవా

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల తర్వాత వైకాపా సోషల్‌ మీడియా, ఐప్యాక్‌ల బృందంతో పాటు జగన్‌ కనుసన్నల్లో నడిచిన సీఐడీ కార్యాలయం కూడా ఖాళీ అయిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లో తెదేపా ముసుగులో కువైట్‌ కేంద్రంగా పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న రేమాల మన్విత్‌ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేయడానికి సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్తే అక్కడ ఒక్కరూ లేరని సోమవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘కార్యాలయంలో ఎవరు లేకపోవడాన్ని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా దృష్టికి తీసుకెళ్లాను. కొద్దిసేపటి తర్వాత డీఐజీ (శాంతిభద్రతలు), సీఐడీ ఎస్పీల నుంచి ఫోన్‌లు వచ్చాయి. కార్యాలయంలో వేచి ఉండండి. మీ ఫిర్యాదును తీసుకుంటామని చెప్పారు’ అని వర్ల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు