దేశం మార్పు తుపాను చూస్తోంది: రాహుల్‌

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అండగా నిలిచారన్న సంగతి విస్పష్టమని, దేశం మార్పు తుపానును చూస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Updated : 21 May 2024 06:22 IST

దిల్లీ, రాయ్‌బరేలీ: రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అండగా నిలిచారన్న సంగతి విస్పష్టమని, దేశం మార్పు తుపానును చూస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఐదో దశలో భాగంగా సోమవారం 49 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘తొలి నాలుగు దశల పోలింగ్‌ సరళిని పరిశీలించాక.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, భాజపాను ఓడించేందుకు ప్రజలు అండగా నిలిచారన్నది స్పష్టమవుతోంది’’ అని ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘విద్వేష రాజకీయాలతో దేశం విసిగిపోయింది. ఇప్పుడు సొంత సమస్యల పరిష్కారానికి ఓటింగ్‌ జరుగుతోంది. యువత ఉద్యోగాల కోసం, రైతులు కనీస మద్దతు ధర, రుణ విముక్తి కోసం, మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం, భద్రత కోసం, కార్మికులు సముచితమైన వేతనాల కోసం ఓటు వేస్తున్నారు’’ అని వెల్లడించారు. తాను పోటీచేస్తున్న రాయ్‌బరేలీలోని హనుమాన్‌ ఆలయంలో రాహుల్‌ సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని