మంచిరోజులు వస్తున్నాయి.. మోదీ వెళ్లిపోతున్నారు: కేజ్రీవాల్‌

త్వరలో దేశానికి ‘మంచిరోజులు రాబోతున్నాయి..మోదీజీ వెళ్లిపోతున్నారు’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Updated : 21 May 2024 06:20 IST

దిల్లీ: త్వరలో దేశానికి ‘మంచిరోజులు రాబోతున్నాయి..మోదీజీ వెళ్లిపోతున్నారు’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఎన్నికల సభల్లో తొలిసారి తన భార్య సునీతతో కలిసి కనిపించారు. తాను లేని సమయంలో ఎన్నికల ప్రచారంపై పట్టుసాధించడాన్ని ప్రశంసిస్తూ..‘ఝాన్సీ కి రాణి’ అంటూ శ్లాఘించారు. ‘‘ఈ రోజు నాతో బాటు నా భార్యను తీసుకొచ్చా. నేను లేని సమయంలో అంతా తానై నడిపించారు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను తరచూ కలిసింది. ఆ సందర్భాల్లో ఆమె ద్వారా దిల్లీ ప్రజల యోగక్షేమాలను తెలుసుకుని వారికి నా సందేశాలు పంపేవాడిని. ఆమె ఝాన్సీ రాణి వంటివారు’’ అని తూర్పు దిల్లీ గాంధీనగర్‌ ఎన్నికల సభలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా తన భర్త జైలుకు వెళ్లే పరిస్థితిని తప్పించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని