ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు

తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి అప్పులు చేస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఫిర్యాదు చేశారు.

Published : 21 May 2024 05:08 IST

కేంద్ర మంత్రికి ప్రభాకర్‌ ఫిర్యాదు

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి అప్పులు చేస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆరునెలల్లో రూ.12,905 కోట్లు అప్పు చేసింది. నిబంధన నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం బడ్జెటేతర రుణాలు తీసుకుంటోంది. అప్పుల కోసం కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను గాడిలో పెట్టేందుకు రిజర్వ్‌బ్యాంకు ద్వారా కొత్త మార్గదర్శక సూత్రాలు విడుదల చేయించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని