తెదేపాకు ఓట్లేశారు.. మీకు నీళ్లిచ్చేది లేదు

మీరు తెదేపా వాళ్లు.. మా ప్రభుత్వ నిధులతో వేసిన డీప్‌ బోరు నీటిని మీకు ఇచ్చేది లేదు. దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ వైకాపా నాయకులు సరఫరాను నిలిపివేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 22 May 2024 08:02 IST

ప్రకాశం జిల్లాలో వైకాపా నాయకుల అరాచకం

పెద్దయాచవరం గ్రామం ఎస్సీపాలెంలో నీరు సరఫరా కాకుండా తొలగించిన పైపులైన్‌

మార్కాపురం, న్యూస్‌టుడే: ‘మీరు తెదేపా వాళ్లు.. మా ప్రభుత్వ నిధులతో వేసిన డీప్‌ బోరు నీటిని మీకు ఇచ్చేది లేదు. దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ వైకాపా నాయకులు సరఫరాను నిలిపివేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని పెద్దయాచవరం ఎస్సీపాలెంలో వైకాపాకు చెందిన ఎంపీపీ నిధులతో గతేడాది డీప్‌బోరును ఏర్పాటు చేశారు. ఆ నీటిని ఎస్సీపాలెం వాసులకు పైపులైన్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ఎస్సీపాలెం వారు వైకాపాకు ఓట్లు వేయలేదని ఆ పార్టీ నాయకులు కక్షగట్టారు. తాగునీటి పైపులైన్‌ కనెక్షన్‌ను తొలగించారు. ఇదేమని వారు ప్రశ్నిస్తే.. ‘మీరు ఎవరికి ఓట్లు వేశారో.. వారినే నీళ్లు అడగండి’ అని బెదిరించారు. ఐదు రోజులుగా నీటిని అడ్డుకోవడంతో పాలెంవాసులు సమీప గ్రామంలోకి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మరోవైపు మండలంలోని నాయుడుపల్లె ఎస్సీపాలెంలో ప్రభుత్వం ట్యాంకర్లతో సరఫరా చేసే నీటిని వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ట్యాంకర్ల డ్రైవర్లను బెదిరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని