ఓట్ల కోసం తమిళుల్ని కించపరుస్తారా?

ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయ రత్న భాండాగారం తాళాలు తమ రాష్ట్రానికి చేరి ఉంటాయని ప్రధాని మోదీ చెప్పడంపై తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు.

Published : 22 May 2024 04:55 IST

మోదీ వ్యాఖ్యపై స్టాలిన్‌ అభ్యంతరం

చెన్నై: ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయ రత్న భాండాగారం తాళాలు తమ రాష్ట్రానికి చేరి ఉంటాయని ప్రధాని మోదీ చెప్పడంపై తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. అక్కడ ఓట్లు రాబట్టుకోవడం కోసం తమిళుల్ని కించపరిచేందుకు జరిగిన ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు. ‘‘ప్రజల నడుమ శత్రుత్వాన్ని, రాష్ట్రాల మధ్య కోపతాపాలను పెంచేలా విద్వేషపూరిత వ్యాఖ్యల్ని ప్రధాని చేస్తున్నారు. ఇది కోట్లమంది ఆరాధించే పూరీ జగన్నాథుడిని కించపరచడంతో సమానం. తమిళనాడు ప్రజల్ని దీనిద్వారా అవమానించారు. నిజానికి ఒడిశాతో తమిళనాడుకు చక్కని స్నేహబంధం ఉంది. ఒక ఆలయ కోశాగారాన్ని దొంగలు దోచుకుంటే తమిళ ప్రజల్ని ప్రధాని అవమానించడమేమిటి? తమిళుల పట్ల అంత విముఖత, ద్వేషం ఎందుకు? ఇక్కడకు వచ్చి తమిళ భాషను, తమిళుల్ని పొగిడిన వ్యక్తే వేరే రాష్ట్రానికి వెళ్లి విరుద్ధంగా మాట్లాడడం విడ్డూరం’’ అని స్టాలిన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని