సందేశ్‌ఖాలీ మహిళల దుస్థితి చూసి నా హృదయం ముక్కలైంది

అమాయక మహిళలను భాజపా తన రాజకీయ క్రీడలకు పావులుగా వినియోగించుకుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్‌పర్సన్‌ మమతా బెనర్జీ ఆరోపించారు.

Published : 22 May 2024 04:56 IST

ఇదంతా భాజపా కుట్రే: మమత

బసీర్‌హాట్‌: అమాయక మహిళలను భాజపా తన రాజకీయ క్రీడలకు పావులుగా వినియోగించుకుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్‌పర్సన్‌ మమతా బెనర్జీ ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో మహిళల దుస్థితి చూసి తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాషాయ పార్టీ కుట్రలన్నీ బహిర్గతం అయ్యాయి అసలు నిజమేమిటో తెలిసిందని, లేకుంటే ఎన్నటికీ అవి బయటకు వచ్చేవి కావని తెలిపారు. బసీర్‌హాట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల సభలో మమతా బెనర్జీ మాట్లాడారు. సందేశ్‌ఖాలీలో ధర్నా నిర్వహించిన, భాజపా అభ్యర్థి రేఖా పాత్రతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ...ఆ సంభాషణనూ రాజకీయం చేశారని దీదీ తప్పుపట్టారు. భాజపా పాలిత ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. సందేశ్‌ఖాలీలోని మహిళలు అవమానానికి గురైనందుకు తాను చింతిస్తున్నానని, మహిళల గౌరవంతో ఎవరూ ఆడుకోకూడదన్నారు. బసీర్‌హాట్‌ లోక్‌సభ స్థానం నుంచి తమ అభ్యర్థి హాజీ నూరుల్‌ గెలిచిన వెంటనే, తొలుత తాను సందేశ్‌ఖాలీలోనే పర్యటిస్తానని మమత హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు