వ్యవస్థలన్నీ నిష్ఫలం : ప్రియాంక

మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చాలనే కృతనిశ్చయంతో భాజపా ఉందని, గత పదేళ్లలో పార్లమెంటు, న్యాయవ్యవస్థ సహా వ్యవస్థల్ని అది నిష్ఫలం చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు.

Updated : 23 May 2024 06:28 IST

గొడ్డా/ రాంచీ: మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చాలనే కృతనిశ్చయంతో భాజపా ఉందని, గత పదేళ్లలో పార్లమెంటు, న్యాయవ్యవస్థ సహా వ్యవస్థల్ని అది నిష్ఫలం చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు. కేంద్ర విధానాలను ఎవరు వ్యతిరేకిస్తే వారిని వేధిస్తున్నారని చెప్పారు. ఝార్ఖండ్‌లోని గొడ్డా, రాంచీలలో బుధవారం ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. దేశంలో అన్ని ప్రధాన వ్యవస్థల్ని కాంగ్రెస్సే తీసుకువచ్చిందని చెప్పారు. ‘‘కొవిడ్‌ టీకాలు తయారు చేసే ఒక సంస్థ నుంచి ప్రధాని రూ.52 కోట్లు విరాళం తీసుకున్నారు. ఆ వ్యాక్సిన్‌ ఇప్పుడు ప్రజల శరీరాలపై దుష్ప్రభావం చూపిస్తోంది. పారిశ్రామికవేత్తల రుణాలను ప్రభుత్వం రద్దుచేయడంతోపాటు ప్రజల ఆస్తుల్ని విక్రయించేసింది. దానివల్ల 70 కోట్లమంది యువత నిరుద్యోగులుగా మారారు. చంద్రయాన్‌-3 ఖ్యాతిని పొందడం మరచిపోని మోదీ.. ఆ ప్రయోగం వెనుక ఉన్న హెచ్‌ఈసీ వంటి సంస్థల సిబ్బందికి జీతాలు రాకపోయినా పట్టించుకోరు’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని