దిల్లీకి తాగునీటిని ఆపేసిన హరియాణా

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని లక్ష్యంగా చేసుకుని దేశ రాజధానికి తాగునీటి సరఫరాను నిలిపివేసేందుకు భాజపా కుట్ర పన్నిందని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఆప్‌ను భాజపా అన్నివిధాలా లక్ష్యంగా చేసుకుంటోందని బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె విమర్శించారు.

Published : 23 May 2024 05:58 IST

భాజపా కుట్రగా పేర్కొన్న ఆప్‌ 

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని లక్ష్యంగా చేసుకుని దేశ రాజధానికి తాగునీటి సరఫరాను నిలిపివేసేందుకు భాజపా కుట్ర పన్నిందని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఆప్‌ను భాజపా అన్నివిధాలా లక్ష్యంగా చేసుకుంటోందని బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె విమర్శించారు. తొలుత ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, ఆయన బెయిల్‌పై విడుదలయ్యాక రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ ద్వారా ఆయనపై ఆరోపణలు చేయించడం, ఇప్పుడు నీటిని అడ్డుకోవడం దీనికి ఉదాహరణలుగా చెప్పారు. నీటిసరఫరాపై వెంటనే హరియాణాకు లేఖ రాస్తామని, స్పందన రాకపోతే సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేస్తామని తెలిపారు. జూన్‌ 4న ‘ఇండియా’ కూటమి భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అనంతరం ఎన్నికల బాండ్ల అవకతవకలపై దర్యాప్తు చేపట్టి.. భాజపా నాయకులను, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను జైలుకు పంపుతామని ఆమె చెప్పారు. 

తాగునీటి విషయంలో ఆతిశీ ఆరోపణల్ని దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే కొత్త అబద్ధాలను ఆప్‌ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. దిల్లీలో నీటికొరతకు ఆప్‌ సర్కారు అవినీతి, అలసత్వమే కారణమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని