కాంగ్రెస్, ఎస్పీ ఓటర్లందరూ చొరబాటుదారులు

తమ ఓటు బ్యాంకును కోల్పోవాల్సివస్తుందనే భయంతోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ అయోధ్య రామాలయాన్ని సందర్శించడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు.

Published : 24 May 2024 03:48 IST

అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తే ఆ ఓట్లు పోతాయని  రాహుల్, అఖిలేశ్‌ భయం
అమిత్‌ షా విమర్శలు

అంబేడ్కర్‌ నగర్‌: తమ ఓటు బ్యాంకును కోల్పోవాల్సివస్తుందనే భయంతోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ అయోధ్య రామాలయాన్ని సందర్శించడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు.ఆ రెండు పార్టీల ఓటర్లు అందరూ చొరబాటుదారులేనంటూ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో పోలింగ్‌ జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు స్థానాల పరిధిలో గురువారం నిర్వహించిన పలు ప్రచార సభల్లో అమిత్‌ షా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పోలింగ్‌ జరిగిన స్థానాల్లో భాజపా 310 సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా దక్కవని అంబేడ్కర్‌నగర్‌ సభలో పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వస్తే మత ప్రాతిపదిక రిజర్వేషన్లకు ముగింపు పలికి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తిరిగి ఇస్తామని చెప్పారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ఆరు నెలల్లో భారత్‌లో విలీనం చేస్తామని ఉద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే రాహుల్, అఖిలేశ్‌లు విహార యాత్రలకు విదేశాలకు వెళతారని ఆరోపించారు. ‘ప్రధాని మోదీ గత 23 ఏళ్లుగా ఎలాంటి సెలవు తీసుకోలేదు. దీపావళి వస్తే సరిహద్దుల్లోని సైనికుల వద్దకు వెళ్తున్నార’ని అమిత్‌ షా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని