శవ రాజకీయాలు మానండి: మంత్రి జూపల్లి

భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్యకు దురలవాట్లు, భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Published : 24 May 2024 03:57 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌:  భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్యకు దురలవాట్లు, భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓప్రకటన విడుదల చేశారు. హత్య జరిగిన క్షణాల్లోనే భారాస నాయకులు రంగంలోకి దిగి ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా తనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో మల్లేశ్‌ హత్యకు కూడా రాజకీయ రంగు పులిమారని, ఇప్పుడు శ్రీధర్‌రెడ్డి హత్యనూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇకనైనా కేటీఆర్‌ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని