ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌దే విజయం

ఎన్నిక ఏదైనా గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు.

Published : 24 May 2024 03:58 IST

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మరిపెడ, న్యూస్‌టుడే: ఎన్నిక ఏదైనా గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్న ఘనత తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు, నాయకులకే దక్కుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు గెలవబోతున్నామని.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదు నెలల్లో మూడు నెలలు మాత్రమే ప్రభుత్వం పనిచేసిందని, రెండు నెలలు ఎన్నికల కోడ్‌ ఉందన్నారు. భారాస హయాంలో అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, అవినీతిమయంగా మారిన ప్రభుత్వ యంత్రాంగాన్ని సరిచేసుకుంటూ.. కుంగిపోయిన కాళేశ్వరాన్ని నిలబెట్టేలా, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తడిసిన ధాన్యంతోపాటు మొలకెత్తిన వడ్లను సైతం కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థులు రఘురాంరెడ్డి, బలరాంనాయక్‌ ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని