బిహార్‌లో దారిమళ్లిన యోగి హెలికాప్టర్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒకటి బిహార్‌లో దారిమళ్లింది.

Published : 24 May 2024 06:34 IST

మోతిహారీ (బిహార్‌): ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒకటి బిహార్‌లో దారిమళ్లింది. ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళ్లింది! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి గురువారం బిహార్‌కు వెళ్లారు. భాజపా ముందుగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం- పశ్చిమ చంపారణ్‌లో ర్యాలీతో రాష్ట్రంలో ఆయన పర్యటన ముగియాలి. అంతకంటే ముందు తూర్పు చంపారణ్‌లో ప్రసంగించాలి. కానీ హెలికాప్టర్‌ దారిమళ్లడంతో తొలుత పశ్చిమ చంపారణ్‌కు, ఆ తర్వాత తూర్పు చంపారణ్‌కు ఆయన వెళ్లాల్సి వచ్చింది. పశ్చిమ చంపారణ్‌లో ప్రసంగిస్తూ యోగి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని