‘మండలి’ పోలింగు రోజు వారికి సెలవు: ఈసీ

రాష్ట్ర శాసనమండలిలో వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగు రోజును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేసే వారిలో ఓటు ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక సెలవు (స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌)గా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Published : 25 May 2024 03:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలిలో వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగు రోజును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేసే వారిలో ఓటు ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక సెలవు (స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌)గా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉప ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగనుండగా.. ఆ రోజు ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఓటు ఉన్న వారికి విధుల సమయాల్లో వెసులుబాటు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఓటర్లకు మాత్రమే ప్రత్యేక సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగు జరుగుతుంది. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని 4,61,806 మంది ఓటర్లు నమోదు అయ్యారు. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం మండలి ఎన్నికల పోలింగు రోజున ప్రయివేటు సంస్థలకు సెలవు ఇచ్చే అవకాశం లేకపోవటంతో డ్యూటీ షిఫ్టుల్లో మార్పులు చేయాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని