మానవ అక్రమ రవాణాకు.. ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరం

మానవ అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కాంబోడియాలో చిక్కుకుపోయిన 150 మంది తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను ‘ఎక్స్‌’ ద్వారా ఆయన కోరారు.

Published : 25 May 2024 04:23 IST

 తెదేపా అధినేత చంద్రబాబు 

ఈనాడు డిజిటల్, అమరావతి: మానవ అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కాంబోడియాలో చిక్కుకుపోయిన 150 మంది తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను ‘ఎక్స్‌’ ద్వారా ఆయన కోరారు. ‘‘ఉద్యోగాల పేరుతో మన రాష్ట్రానికి చెందిన యువకుల్ని అక్రమంగా కాంబోడియా తరలించి, సైబర్‌ క్రైమ్‌ ఉచ్చులోకి నెట్టారు. యువతను మోసం చేసి, వారి జీవితాలను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.  

తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు: మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కండ్లగుంట గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లో తెదేపా ఏజెంట్‌గా ఉన్న నోముల మాణిక్యాలరావుతో చంద్రబాబు శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయనకు ధైర్యం చెప్పారు. పోలింగ్‌ రోజున కండ్లగుంటలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిని మాణిక్యలరావు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వెంకట్రామిరెడ్డి.. తన అనుచరులతో కలిసి మాణిక్యాలరావు ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అతడినీ చంపేస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన మాణిక్యాలరావు హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు