ఇండియా కూటమితోనే సర్వతోముఖాభివృద్ధి

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర ఆర్థిక విధానాలతో దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Published : 25 May 2024 05:02 IST

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క

ఫరీద్‌కోట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి రైతులు, స్థానిక నాయకులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర ఆర్థిక విధానాలతో దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పదేళ్లుగా అనుసరించిన పక్షపాత వైఖరి, వేధింపుల మూలంగానే మన దేశం నుంచి అనేక పెట్టుబడులు తరలిపోయాయన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే దేశ ఆర్థిక రంగం ఒడుదొడుకులకు గురవుతుందని, స్టాక్‌ మార్కెట్లు పతనమవుతాయంటూ భాజపా నేతలు పెట్టుబడిదారుల్లో భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని