ఎంపీ పదవికి రాజీనామా చేయను: స్వాతి మాలీవాల్‌ స్పష్టీకరణ

ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ తన పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు. అలా కాకుండా తనపై దాడి చేయడంతో.. ఇప్పుడు పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.

Published : 25 May 2024 05:37 IST

దిల్లీ: ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ తన పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు. అలా కాకుండా తనపై దాడి చేయడంతో.. ఇప్పుడు పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ‘‘2006లో ఆప్‌తో కలిసి పనిచేసేందుకు వీలుగా నా ఉద్యోగాన్ని వదులుకున్నాను. పార్టీ కోసం ఎంతో శ్రమించాను. ఎవరికైనా నా రాజ్యసభ సీటు కావాలంటే నన్ను అడగాలి. పార్టీ కోసం జీవితాన్నే ఇచ్చాను. ఎంపీ సీటు చాలా చిన్న విషయం. నేను ఆప్‌లో చేరినప్పటి నుంచి ఎటువంటి పదవీ కోరలేదు. కానీ, వారు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను’’అని మాలీవాల్‌ అన్నారు. స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో నిందితుడు బిభవ్‌ కుమార్‌కు దిల్లీ కోర్టు శుక్రవారం నాలుగురోజుల జుడిషియల్‌ కస్టడీ విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని