పోలింగ్‌ వివరాలను దీర్ఘకాలం భద్రపరచాలి: సిబల్‌

ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైన పోలింగ్‌ వివరాలను (లాగ్‌) ఎన్నికల సంఘం (ఈసీ) 30 రోజులపాటు మాత్రమే భద్రపరుస్తోందని, అలా కాకుండా రెండు మూడేళ్ల వరకు భద్రపరిచేలా ఈసీని ఆదేశించాలని రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ శుక్రవారం సుప్రీంకోర్టును కోరారు.

Published : 25 May 2024 05:37 IST

దిల్లీ: ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైన పోలింగ్‌ వివరాలను (లాగ్‌) ఎన్నికల సంఘం (ఈసీ) 30 రోజులపాటు మాత్రమే భద్రపరుస్తోందని, అలా కాకుండా రెండు మూడేళ్ల వరకు భద్రపరిచేలా ఈసీని ఆదేశించాలని రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ శుక్రవారం సుప్రీంకోర్టును కోరారు. లాగ్‌లను ఇలా భద్రపరిస్తే ఏ సమయానికి ఎన్ని ఓట్లు పోలైనది, ఓటింగ్‌ ఎప్పుడు ముగిసింది, ఎన్ని ఓట్లు చెల్లకుండా పోయాయనేది తెలుస్తుందని వివరించారు.  ఓట్ల లెక్కింపునకు ముందు అన్ని దశల పోలింగ్‌ రికార్డులను తెలిపే ఈవీఎం లాగ్‌లను దీర్ఘకాలం భద్రపరిస్తే ఏ పార్లమెంటు సభ్యుడు కూడా చట్టవిరుద్ధంగా ఎన్నికయ్యే అవకాశం లేకుండా చూడవచ్చన్నారు. ఓటింగ్‌ శాతం ఎప్పుడు పెరిగిందో కూడా తెలుసుకోవచ్చు. మరోవైపు, లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్నందున పోలింగ్‌ శాతం వివరాలను తెలిపే ఫారం- 17సీని తన వెబ్‌సైట్‌లో పెడితే కలకలం రేగుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని