ఇండియా కూటమి గెలిస్తే బిహార్‌లో మళ్లీ గూండాల రాజ్యమే: అమిత్‌ షా

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Updated : 25 May 2024 05:48 IST

ఆరా, దేవ్‌గఢ్‌: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన కుటుంబ సభ్యులకు పదవుల కోసం మినహా మరెవరికీ చివరకు సొంత సామాజిక వర్గానికి కూడా ఆయన ఎలాంటి మేలు చేయరని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శుక్రవారం అమిత్‌ షా బిహార్‌లోని ఆరా నియోజకవర్గంలో కేంద్ర మంత్రి ఆర్‌.కె.సింగ్‌ తరఫున ప్రచార సభలో పాల్గొన్నారు. లాలూ ప్రసాద్‌ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి గెలిస్తే బిహార్‌లో మళ్లీ ఆటవిక, గూండాల, కిడ్నాపుల రాజ్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల వారి కోసం ఆర్జేడీ నేత శ్రమిస్తారని భావించడం భ్రమేనని పేర్కొన్నారు. భార్య, కుమారులు, కుమార్తెలకు పదవులు సాధించుకోవడమే లాలూ లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు వాటిని కట్టబెట్టాలని చూస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలపై విమర్శలు సంధించారు. కాంగ్రెస్, ఆర్జేడీలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వ్యతిరేకమని ఆరోపించారు.   

ఝార్ఖండ్‌ రాష్ట్రం కాంగ్రెస్‌పార్టీకి ఓటు బ్యాంకుగా, స్థిరాస్తిగా, ల్యాండ్‌ బ్యాంకుగా, అవినీతికి ఏటీఎంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దుమ్కా సభలో దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని