272 స్థానాల్లో ఇండియా కూటమి విజయం ఖరారు

దేశంలో లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో భాజపా ఓటమి నిర్ధారితమైందని శనివారం కాంగ్రెస్‌ పేర్కొంది. విపక్ష ఇండియా కూటమి 272 స్థానాల్లో విజయాన్ని ఖరారు చేసుకుని 350 సీట్ల సాధన దిశగా సాగిపోతోందని వెల్లడించింది.

Updated : 26 May 2024 06:39 IST

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌

దిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో భాజపా ఓటమి నిర్ధారితమైందని శనివారం కాంగ్రెస్‌ పేర్కొంది. విపక్ష ఇండియా కూటమి 272 స్థానాల్లో విజయాన్ని ఖరారు చేసుకుని 350 సీట్ల సాధన దిశగా సాగిపోతోందని వెల్లడించింది. ఎన్‌డీయే కూటమిని చిత్తుగా ఓడించబోతోందని తెలిపింది. ‘‘ఆరు దశల్లో 486 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. పదవి నుంచి దిగిపోనున్న ప్రధానమంత్రి పదవీ విరమణ ప్రణాళికలు వేసుకుంటున్నారు. భాజపా భవితవ్యం తేలిపోయింది. వారు దక్షిణాదిలో తుడిచిపెట్టుకుపోతున్నారు. దేశ ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో సగానికి తగ్గిపోతున్నారు. కూటమి మిత్రపక్షాల మధ్య అద్భుతమైన సమన్వయాన్ని మేం గమనించాం’’ అని జైరాం రమేశ్‌ శనివారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని