శ్రీధర్‌రెడ్డి హత్యపై సిట్‌ ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలో రాయలసీమ ఫ్యాక్షనిజం లాంటి పరిస్థితులు నెలకొన్నాయని నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి హోంశాఖ బాధ్యతలు చూస్తున్నా వనపర్తి జిల్లాకు చెందిన భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్యకేసులో ఇప్పటివరకు ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదని విమర్శించారు.

Published : 26 May 2024 04:09 IST

నాగర్‌కర్నూల్‌ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాయలసీమ ఫ్యాక్షనిజం లాంటి పరిస్థితులు నెలకొన్నాయని నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి హోంశాఖ బాధ్యతలు చూస్తున్నా వనపర్తి జిల్లాకు చెందిన భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్యకేసులో ఇప్పటివరకు ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదని విమర్శించారు. ఈ హత్యపై సిట్‌ ఏర్పాటు చేయాలని, కొల్లాపూర్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి జూపల్లి అనుచరులే హత్యకు కారణమని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా, పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లలా వ్యవహరిస్తూ ఇప్పటివరకు వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారమిక్కడ హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌లో ఉన్న పరిస్థితులపై డీజీపీకి వివరించినా ఈ హత్య జరిగిందన్నారు. శ్రీధర్‌రెడ్డి గురించి మాట్లాడే మంత్రి జూపల్లి నిందితులను ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  శ్రీధర్‌రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని