భారాస, భాజపా మినహా అందరినీ ఆహ్వానిస్తాం

రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 2న నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు.

Updated : 26 May 2024 06:16 IST

రాష్ట్ర అవతరణ వేడుకలపై ప్రభుత్వ నిర్ణయం: మల్లు రవి

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 2న నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు భారాస, భాజపా మినహా తెలంగాణ సాధన కోసం పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలను, ముఖ్యులను ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు.

కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు వినతిపత్రం ఇస్తున్న మల్లు రవి తదితరులు

కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను కించపరిచేలా మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మల్లు రవి తెలిపారు. కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని