భాజపాకు మత రాజకీయాలే ఎజెండా

హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప భాజపాకు మరో ఎజెండా లేదని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విమర్శించారు. శనివారం పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌ కోట్‌  లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్‌ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 26 May 2024 06:05 IST

పంజాబ్‌ ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఫరీద్‌కోట్‌లో స్థానిక నాయకులతో భట్టి సమావేశం

హైదరాబాద్, న్యూస్‌టుడే: హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప భాజపాకు మరో ఎజెండా లేదని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విమర్శించారు. శనివారం పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌ కోట్‌  లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్‌ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని, దానికి అనుగుణంగానే పోరాడుతుందన్నారు. దేశంలో కొద్ది మంది మాత్రమే ధనికులుగా,  మిగిలిన వాళ్లంతా పేదవారిగా మిగిలిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని విమర్శించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ముందంజలో ఉందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని