ధాన్యం కొనుగోళ్లలో భారీగా అవకతవకలు

‘రాష్ట్రంలో పౌరసరఫరాలశాఖ అవినీతిలో కూరుకుపోయింది. ధాన్యం కొనుగోలులో రూ.800 కోట్లు దోపిడీ జరిగింది. దీనిపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాస్తాం’ అని భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Published : 26 May 2024 06:06 IST

సీఎంకు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బహిరంగ లేఖ

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో పౌరసరఫరాలశాఖ అవినీతిలో కూరుకుపోయింది. ధాన్యం కొనుగోలులో రూ.800 కోట్లు దోపిడీ జరిగింది. దీనిపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాస్తాం’ అని భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి హైకోర్టు సిటింగ్‌ జడ్జితో లేదా విశ్రాంత న్యాయమూర్తితో నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తే ఆధారాలు సమర్పిస్తామన్నారు. శనివారం నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి 19 ప్రశ్నలు సంధిస్తూ సీఎంకు రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిర్వహణలో లేని రైస్‌ మిల్లులకు ధాన్యం ఎలా ఇస్తున్నారు..? ప్రభుత్వానికి మిల్లర్లు చెల్లించాల్సిన డబ్బులు ఎందుకు వసూలు చేయడం లేదు..? మిల్లర్లకు రూ.2259కి సన్న వడ్లు విక్రయించి, మళ్లీ వారి వద్దే రూ.5700 భారీ ధరతో కొనడం వెనుక మతలబు ఏంటి..? గతంలో సన్న బియ్యం కిలో రూ.35 నుంచి రూ.37కే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఏకంగా రూ.57 చొప్పున చెల్లించి 22 లక్షల క్వింటాళ్లు సేకరించడంతో రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వంపై అదనపు భారం పడింది. ఈ అవినీతిపై సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదు..?’ అని ప్రశ్నించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని