తెదేపా ఏజెంట్లపై దాడిచేసిన వైకాపా నేత అరెస్టు

పల్నాడు జిల్లాలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. పోలింగ్, ఆ తర్వాతి రోజుల్లో అల్లర్ల ఘటనలకు సంబంధించిన నిందితులను గుర్తించి.. వారిపై కేసులు నమోదు చేయించడం, అరెస్టు చేయడం వంటి చర్యలను బృందం సూచిస్తుంది.

Published : 26 May 2024 04:43 IST

కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. పోలింగ్, ఆ తర్వాతి రోజుల్లో అల్లర్ల ఘటనలకు సంబంధించిన నిందితులను గుర్తించి.. వారిపై కేసులు నమోదు చేయించడం, అరెస్టు చేయడం వంటి చర్యలను బృందం సూచిస్తుంది. శనివారం నరసరావుపేట టూటౌన్, రెంటచింతల పోలీస్‌స్టేషన్‌లలో సిట్‌ బృందం విచారణ చేపట్టింది. అల్లర్ల ఘటనల్లో పాల్గొన్నవారిని వీడియోల ద్వారా స్థానిక వీఆర్వోల సాయంతో గుర్తిస్తున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసి.. వారు ఇళ్లవద్ద ఉంటే అదుపులోకి తీసుకుంటున్నారు. వందల సంఖ్యలో ఇరుపార్టీల వారు దాడుల్లో పాల్గొనడంతో.. కొందరి ముఖాలు అస్పష్టంగా ఉండడంతో గుర్తించడం కష్టమవుతోంది. దీంతో రోజులతరబడి విచారణ చేయాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. రెంటచింతల మండలం రెంటాలలో పోలింగ్‌ రోజు గొడ్డళ్లతో తెదేపా ఏజెంట్లపైకి దాడులకు తెగబడ్డ ఘటనలో.. ప్రధాన నిందితుడు మాజీ జడ్పీటీసీ సభ్యుడు, వైకాపా నేత భాస్కర్‌రెడ్డిని శనివారం అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని