సీఎస్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా: పీతల మూర్తియాదవ్‌

భూ కుంభకోణానికి సంబంధించి సీఎస్‌ జవహర్‌రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ అన్నారు.

Published : 27 May 2024 04:33 IST

విశాఖపట్నం (సీతంపేట), న్యూస్‌టుడే: భూ కుంభకోణానికి సంబంధించి సీఎస్‌ జవహర్‌రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ అన్నారు. విశాఖలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీబీఐ లేదా సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే తగిన ఆధారాలు చూపుతానని స్పష్టం చేశారు. సీఎస్‌ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. సీఎస్‌ అక్రమంగా విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ, విశాఖపట్నం జిల్లా ఆనందపురం, పద్మనాభం తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల ఎసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. ఆయా భూముల సర్వే నంబర్లతో సహా ఈ వ్యవహారాన్ని రుజువు చేస్తానని పునరుద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని